చైల్డ్‌ ఇన్‌ఫోలో అవకతవకలు

ABN , First Publish Date - 2021-10-19T06:30:59+05:30 IST

ప్రస్తుత విద్యా సంవత్సరం (2021-22) చైల్డ్‌ ఇన్‌ఫోలో అనేక అవకతవకలు చోటుచేసు కున్నాయి.

చైల్డ్‌ ఇన్‌ఫోలో అవకతవకలు

ఒంగోలు విద్య, అక్టోబరు 18 : ప్రస్తుత విద్యా సంవత్సరం (2021-22) చైల్డ్‌ ఇన్‌ఫోలో అనేక అవకతవకలు చోటుచేసు కున్నాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం పరిశీల నలో అవి వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 60,756 మంది విద్యార్థుల వివరాలు ఆధార్‌ లేకుండా అప్‌లోడ్‌ చేశారు. 26,338 మంది వివరాలను బహుళ ఆధార్‌ నంబర్లతో పంపారు. 52,713 మంది ఆధార్‌ను వేర్వేరు చైల్డ్‌ ఐడీ నంబర్లతో అప్‌లోడ్‌ చేశారు. 29,123 మందికి విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లలో ఒకదానినే పొందుపరిచారు. 51,587 మందికి ఆధార్‌ నెంబరు లేకుండా వేరే ఐడీ నంబరుతో నమోదు చేశారు. 1,72,513మందికి బ్యాంకు ఖాతా వివరాలను అప్‌లోడ్‌ చేయలేదు. వాటన్నింటినీ నవంబరు 5లోపు సరిచేయకపోతే ఆ విద్యార్థుల వివరాలను చైల్డ్‌ ఇన్‌ఫో నుంచి తొలగిస్తామని పాఠశాల విద్య డైరెక్టర్‌ హెచ్చరించారు. 





Updated Date - 2021-10-19T06:30:59+05:30 IST