మ్యాంగో రైతా

ABN , First Publish Date - 2020-05-23T18:35:34+05:30 IST

మామిడిపండ్లు - రెండు, పెరుగు - రెండు కప్పులు, పంచదార - రెండు స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, మెంతులు - పావు టీస్పూన్

మ్యాంగో రైతా

కావలసినవి: మామిడిపండ్లు - రెండు, పెరుగు - రెండు కప్పులు, పంచదార - రెండు స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, మెంతులు - పావు టీస్పూన్


తయారీ: మామిడిపండ్లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, పంచదార తీసుకోవాలి. పంచదార కరిగే వరకు స్పూన్‌తో కలియబెట్టాలి. ఇప్పుడు అందులో మామిడిపండు ముక్కలు వేసి కలుపుకోవాలి. మరొక పాత్ర తీసుకొని స్టవ్‌పై పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. ఎండుమిర్చి, మెంతులు వేసి మరికాసేపు వేగించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడిపండు రైతాపై పోసి కలుపుకోవాలి. కొన్ని మామిడి ముక్కలతో గార్నిష్‌ చేసుకోవాలి. ఫిజ్‌లో పెట్టుకుని కూల్‌ మ్యాంగో రైతాను సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-05-23T18:35:34+05:30 IST