Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మామిడికాయ పులిహోర

మామిడికాయ పులిహోర

కచ్చా మ్యాంగోతో మస్తు మజా!

మార్కెట్లో మామిడికాయలు నోరూరిస్తున్నాయి. పచ్చి మామిడికాయలు ఇప్పుడే దొరుకుతాయు కాబట్టి వాటితో రకరకాల వంటలు తయారుచేసుకుని జిహ్వచాపల్యం తీర్చుకోవచ్చు. అలాంటి కొన్ని కచ్చా మ్యాంగో రెసిపీలు ఇవి...


కావలసిన పదార్థాలు: అన్నం - ఒక కప్పు, పచ్చి మామిడికాయ - ఒకటి, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అరటీస్పూన్‌, శనగపప్పు - అరటీస్పూన్‌, వేరుశెనగలు - ఒకటీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్‌, నువ్వుల నూనె - మూడు టీస్పూన్లు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.


తయారు చేయు విధానం: స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుము బాగా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధంగా పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.


మ్యాంగో డిలైట్మ్యాంగో డిలైట్థండాయి సిరప్‌థండాయి సిరప్‌మాల్పువా మాల్పువా కైరీ మ్యాంగో కర్రీకైరీ మ్యాంగో కర్రీచాక్లెట్‌ రవ్వలడ్డుచాక్లెట్‌ రవ్వలడ్డుస్పైసీ సలాడ్‌స్పైసీ సలాడ్‌కడికడిమెంతుల పులుసుమెంతుల పులుసుఆనపకాయ - గింజల పులుసుఆనపకాయ - గింజల పులుసుఅరటిదూట సాంబారుఅరటిదూట సాంబారు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.