Abn logo

మ్యాంగో పనీర్‌ రోల్స్‌

కావలసినవి: మామిడిపండు - ఒకటి, పనీర్‌ - అర కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, సిల్వర్‌ ఫాయిల్‌, రోజ్‌ పెటల్స్‌ - గార్నిష్‌ కోసం.


తయారీ: ముందుగా ఒక పాత్రలో పనీర్‌ను పొడిగా చేయాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మామిడిపండు తొక్క తీసి కొద్దిగా సన్నని, వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  ఒక ప్లేట్‌లో ఆ ముక్కలు పెట్టి, ప్రతీ ముక్కపై కొద్దిగా పనీర్‌ మిశ్రమాన్ని పెట్టుకుంటూ రోల్‌ చేసుకోవాలి. చివరగా సిల్వర్‌ ఫాయిల్‌, రోజ్‌ పెటల్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అయ్యాక సర్వ్‌ చేసుకోవాలి.

పుచ్చకాయ హల్వాబ్రెగ్ గులాబ్ జామ్పనీర్‌ లడ్డుడ్రై ఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ చిక్కీబనానా హల్వాపాలకోవా బ్రెడ్‌చిలగడ దుంపల జామూన్‌చిలగడదుంప స్వీట్‌క్యారెట్‌ ఖీర్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement