కొత్తగూడెంలో ఆర్టీసీ మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌ సేవలు

ABN , First Publish Date - 2022-05-15T05:25:10+05:30 IST

ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీసీ మ్యాంగో సర్వీసు శనివారం ప్రారంభమయ్యాయి. మండలంలోని రామాంజనేయకాలనీ పంచాయతీకి చెందిన బండారి నాగేశ్వరరావు ఇటీవల బంగినపల్లి మామిడికాయల కోసం టీఎస్‌ ఆర్టీసీలో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చారు.

కొత్తగూడెంలో ఆర్టీసీ మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌ సేవలు
ఆర్టీసీ మ్యాంగో పార్సిల్‌ కస్టమర్‌కు అందచేస్తున్న డీఎం వెంకటేశ్వర బాబు, అధికారులు

వినియోగదారుడికి అందచేసిన డీఎం వెంకటేశ్వరబాబు

చుంచుపల్లి, మే 14: ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్టీసీ మ్యాంగో సర్వీసు శనివారం ప్రారంభమయ్యాయి. మండలంలోని రామాంజనేయకాలనీ పంచాయతీకి చెందిన బండారి నాగేశ్వరరావు ఇటీవల బంగినపల్లి మామిడికాయల కోసం టీఎస్‌ ఆర్టీసీలో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చారు. మామిడి పండ్ల పార్సిల్‌ తీసుకుని ఆ ఇంటికి అనుకోని అతిధిగా వెళ్లి మామిడి పండ్లు అందచేయడంతో ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. కార్గోసేవలు విస్తరించే ఉద్దేశంలో భాగంగా మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌ పథకానికి ఆర్టీసీ ఇటీవల శ్రీకారం చుట్టిందని ఈ సేవలను కస్టమర్‌ కొనియాడారు. ఆన్‌లైన్‌లో వినియోగదారులు బుకింగ్‌ చేసుకుంటే నేరుగా వారి ఇంటికే పండ్ల ప్యాక్‌ను సరఫరా చేస్తామని జగిత్యాల నుంచి సరఫరా అయ్యే వీటి ధర ఒక కేజీ రూ. 115చొప్పున,  ఐదు కేజీలకు రూ. 581గా నిర్ణయించామన్నాని ఆర్టీసీ డీఎం తెలిపారు. ఈ పథకంలో కొత్తగూడెం డిపో పరిధిలో మొదటి వినియోగదారునిగా నాగేశ్వరరావుకు అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మంచ నాయక్‌, ఈ. సునీత, పి. చిట్టిబాబు, ఇ. శామ్యూల్‌, కార్గో విభాగం సిబ్బంది హనుమా, వైఎన్‌. రావు, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more