Abn logo

మ్యాంగో ఐస్‌క్రీమ్

కావలసినవి: పాలు - ఒకకప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, మామిడిపండు ముక్కలు - ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - ఒక కప్పు.


తయారీ: ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకొని, అందులో కస్టర్డ్‌ వేసి కలుపుకొని పక్కన  పెట్టుకోవాలి. మిగిలిన పాలను మరొక పాత్రలో తీసుకొని పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగి, పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్‌ మిశ్రమం వేసి కలుపుకోవాలి. కాసేపు మరిగిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి. తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్‌, వెనీలా వేసి కలుపుకోవాలి. మూత గట్టిగా ఉండే పాత్రలోకి మిశ్రమాన్ని మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపయ్యాక ఫ్రిజ్‌లో నుంచి తీసి బాగా కలియబెట్టి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి మ్యాంగో ఐస్‌క్రీమ్‌ సర్వ్‌ చేయాలి.

బ్లూబెర్రీ లెమనేడ్‌థండయ్హోలీ కాంజీ!చిలగడదుంప సలాడ్‌ సూపర్‌ సిట్రస్‌ జ్యూస్‌పెసర్ల సలాడ్‌కోల్డ్‌ కాఫీ బ్లాక్‌ బ్యూటీ రోజ్‌ పానీయం స్పైసీ ఫ్రూట్‌ చాట్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement