చిత్తూరులో మామిడి రైతుల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-23T23:16:03+05:30 IST

చిత్తూరులోమామిడి రైతులు, రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు

చిత్తూరులో మామిడి రైతుల అరెస్టు

చిత్తూరు: చిత్తూరులో మామిడి రైతులు, రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మంత్రులకు వినతి పత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో రోడ్డుపై రైతులు, రైతు నాయకులు ధర్నాకు దిగారు. జిల్లాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రులు సమీక్ష నిర్వహిస్తున్నారు.  మంత్రులను కలిసేందుకు రైతులు, రైతు నాయకులు వచ్చారు. అయితే మంత్రులను కలవడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. 


పోలీసుల తీరును రైతులు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారంటూ రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి ధరల భారీ పతనాన్ని మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించిన తమపై పోలీసులు జులుం ప్రదర్శించారంటూ రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కావాలనే తమను కలవనీయకుండా పోలీసులను రెచ్చగొట్టి  అరెస్టు చేయించారని రైతు నాయకులు ఆరోపించారు.

Updated Date - 2021-06-23T23:16:03+05:30 IST