మామిడి పండుతో నల్ల మచ్చలు మాయం!

ABN , First Publish Date - 2021-04-14T17:05:45+05:30 IST

మామిడి పండులోని సి విటమిన్‌, మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి. అంతేకాదు చర్మం మీది జిడ్డును మాయం చేసి మొటిమలు ఏర్పడకుండా చూస్తాయి. సూర్యకిరణాల ప్రభావం నుంచి విటమిన్‌ సి రక్షణనిస్తుంది. ఈ పండులో మ్యాగ్నిఫెరిన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చర్మానికి సాంత్వననిస్తుంది.

మామిడి పండుతో నల్ల మచ్చలు మాయం!

ఆంధ్రజ్యోతి(14-04-2021)

మామిడి పండులోని సి విటమిన్‌, మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి. అంతేకాదు చర్మం మీది జిడ్డును మాయం చేసి మొటిమలు ఏర్పడకుండా చూస్తాయి. సూర్యకిరణాల ప్రభావం నుంచి విటమిన్‌ సి రక్షణనిస్తుంది. 

ఈ పండులో మ్యాగ్నిఫెరిన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చర్మానికి సాంత్వననిస్తుంది.  

దీనిలోని విటమిన్‌ ఎ చర్మం పటుత్వానికి కారణమైన కొల్లాజెన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది.

మామిడిపండు ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం సున్నితంగా మారుతుంది. అంతేకాదు నల్ల మచ్చలు తొలగిపోతాయి. ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపిస్తుంది.

ముఖం మీది చర్మం ఒకే రంగులో లేనప్పుడు మామిడి పండు రసాన్ని రుద్దుకోవాలి. దాంతో చర్మం అంతా ఒకే రంగులోకి మారుతుంది.


Updated Date - 2021-04-14T17:05:45+05:30 IST