Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మ్యాంగో క్రంబ్‌ బార్స్‌

మ్యాంగో క్రంబ్‌ బార్స్‌

కావలసినవి: మామిడిపండ్లు - మూడు, పంచదార - ఐదు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్న పిండి - అర టేబుల్‌స్పూన్లు, పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, ఉప్పు - పావు టీస్పూన్‌, వెన్న - ముప్పావు కప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్‌.


తయారీ: ముందుగా ఓవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతకు వేడి చేయాలి. మామిడిపండును ముక్కలుగా కట్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో మొక్కజొన్నపిండి, పంచదార వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో పిండి, బేకింగ్‌పౌడర్‌, తగినంత ఉప్పు తీసుకోవాలి. వెన్నను ముక్కలుగా కట్‌ చేసి పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు కోడిగుడ్డు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేయాలి. బాగా కలియబెట్టాలి. మిశ్రమం పొడిపొడిగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌పై ఒక లేయర్‌లా వేసుకోవాలి. దానిపై మామిడిపండు మిశ్రమాన్ని అంతటా సమంగా పడేలా పోయాలి. పైన కొద్దిగా పొడి పిండి మిశ్రమాన్ని చల్లాలి. ఓవెన్‌లో 40 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. తరువాత ఓవెన్‌లో నుంచి తీయాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

కబాబ్స్‌కబాబ్స్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ కట్‌లెట్స్‌మటన్‌ కట్‌లెట్స్‌వర్క్యూ లుక్మేవర్క్యూ లుక్మేటర్పెండో పెప్పర్టర్పెండో పెప్పర్భార్వాన్‌ టంగ్డిభార్వాన్‌ టంగ్డిగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాఅన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌టిక్కాటిక్కామంచూరియామంచూరియా
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.