Oct 23 2021 @ 19:48PM

చిల్ బ్రో: మంగ్లీ పాడిన బొడ్రాయి పాట వైరల్

అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న చిత్రం ‘చిల్ బ్రో’. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌ను కుంచం శంక‌ర్ దర్శకత్వంలో నూతన నిర్మాత శ్రీను చెంబేటీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప‌బ్లిసిటీ కంటెంట్‌.. ప్రేక్ష‌కులు నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. మంగ్లీ వాయిస్‌కి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెర‌సీ ఈ పాట ప్ర‌స్తుతం వైరల్ అవుతోంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత శ్రీను చెంబెటీ తెలిపారు.