Abn logo
Oct 2 2020 @ 02:30AM

అమీర్‌పేటలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌

Kaakateeya

ప్రారంభించిన కల్వకుంట్ల కవిత


అమీర్‌పేట, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేటలో అతిపెద్ద కుటుంబ వస్త్ర ప్రపంచమైన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను గురువారం నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ప్రారంభించారు. ఉదయం 11 గంటల15 నిమిషాలకు షాపింగ్‌ మాల్‌కు చేరుకున్న కవితకు నిర్వాహకులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన కవిత మాల్‌లో ఏర్పాటు చేసిన వస్ర్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మొదట వరంగల్‌, హన్మకొండలో షాపింగ్‌ మాళ్లను ప్రారంభించిన కాసం గ్రూప్‌ నిర్వాహకులు అనతి కాలంలోనే 8 స్టోర్లతో అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగి మూడు వందల కోట్ల వార్షిక టర్నోవర్‌తో 8 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు.


కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నా ప్రారంభోత్సవానికి వందలాది మంది ఆశీర్వదించేందుకు రావడం శుభపరిణామం అన్నారు. అనంతరం చైర్మన్‌ కాసం నమశ్శివాయ మాట్లాడుతూ ఆకర్షణీయమైన వస్త్రశ్రేణిని ప్రవేశపెట్టి కస్టమర్ల మనసులను మాంగళ్య షాపింగ్‌ మాల్‌ దోచుకుంటోందన్నారు. తాము హైదరాబాద్‌లో ప్రవేశించి రెండేళ్లు అవుతున్న సందర్భంగా నగరంలో 6వ షాపిం గ్‌ మాల్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ఫౌండర్‌ పీఎన్‌ మూర్తి, డైరెక్టర్లు కాసం శివప్రసాద్‌, పుల్లూరు అరుణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement