మంగళూరు ‘జూ’ లో ఆకర్షిస్తున్న తెల్లపులి

ABN , First Publish Date - 2022-05-06T17:31:26+05:30 IST

కేంద్ర మృగాలయ ప్రాధికార ప్రాణి వినిమయ పథకంలో భాగంగా చెన్నయ్‌లోని అరిగ్ణర్‌ అణ్ణ మృగాలయం నుంచి ‘కావేరి’ అనే తెల్ల పులిని, ఒక ఉష్ణపక్షిని మం గళూరు జూకు తెప్పించుకున్నారు.

మంగళూరు ‘జూ’ లో ఆకర్షిస్తున్న తెల్లపులి

బెంగళూరు: కేంద్ర మృగాలయ ప్రాధికార ప్రాణి వినిమయ పథకంలో భాగంగా చెన్నయ్‌లోని అరిగ్ణర్‌ అణ్ణ మృగాలయం నుంచి ‘కావేరి’ అనే తెల్ల పులిని, ఒక ఉష్ణపక్షిని మం గళూరు జూకు తెప్పించుకున్నారు. ఇందుకు బదులుగా మంగళూరులోని పిలికుళ జూ నుండి సంజయ్‌ అనే బెంగాల్‌  పులిని, నాలుగు అడవి శునకాలను, కొన్ని పాములను చెన్నయ్‌ జూ కు పంపించారు. మంగళూరులోని పిలికుళ జూలో ఇప్పటికే 11 పులులున్నాయి. కావేరి రాకతో వీటి సంఖ్య 12కు పెరిగింది. కాగా జూలో తొలిసారి అడుగుపెట్టిన ఈ తెల్లపులిని తిలకించేందుకు మంగళూరు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జూ నుంచి, మహారాష్ట్రలోని గోరెవాద జూ నుండి, ఒడిశ్సాలోని నందనకానన జూ నుంచి  మరిన్ని అరుదైన ప్రాణులను తెప్పించుకునే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళూరు పిలికుళ జూ అధికారి ఒకరు గురవారం మీడియాకు చెప్పారు.

Read more