మంగళూరులో దిగాల్సిన విమానం కొచ్చిన్‌కు తరలింపు

ABN , First Publish Date - 2021-04-14T17:38:32+05:30 IST

మంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానానికి వాతావరణం అనుకూలించకపోవడంతో కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. దుబాయ్‌ నుంచి

మంగళూరులో దిగాల్సిన విమానం కొచ్చిన్‌కు తరలింపు

 

బెంగళూరు: మంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానానికి వాతావరణం అనుకూలించకపోవడంతో కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. దుబాయ్‌ నుంచి మంగళూరుకు 118 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం సోమవారం రాత్రి 12.30 గంటలకు ల్యాండ్‌ కావాల్సి ఉండేది. మంగళూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా ల్యాండింగ్‌ సాధ్యం కాదని పైలట్‌ నిర్ధారించారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ సాంకేతిక విభాగం సూచన మేరకు కొచ్చిన్‌కు తరలించి అక్కడ ల్యాండింగ్‌ చేశారు. గంట సమయం తర్వాత మంగళూరు ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్‌ చేస్తామని ఎయిరిండియా అధికారులు ప్రయాణికులకు సూచించారు. దీంతో విమానంలోనే గడిపారు. తెల్లవారుజాముదాకా ప్రయాణికులకు భో జనం, ఇతరత్రా వసతి కల్పించకపోవడంతో నానా తంటాలుపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున కొచ్చిన్‌ నుంచి మంగళూరుకు చేరుకుంది. కాగా ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కొచ్చిన్‌ విమానాశ్రయంలో నిరసన తెలిపారు. 

Updated Date - 2021-04-14T17:38:32+05:30 IST