Maneru river పరివాహక ప్రాంతాలలో నీటమునిగి పంట పొలాలు

ABN , First Publish Date - 2022-07-13T15:28:27+05:30 IST

భారీ వర్షాల కారణంగా మానేరు నది పరివాహక ప్రాంతాలలో పంట పొలాలు నీటమునిగాయి.

Maneru river పరివాహక ప్రాంతాలలో నీటమునిగి పంట పొలాలు

పెద్దపల్లి: భారీ వర్షాల కారణంగా మానేరు నది(Maneru river) పరివాహక ప్రాంతాలలో పంట పొలాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి పలు పెంకుటిల్లు నేలమట్టమయ్యాయి. వరద నీటి ప్రవాహంతో సుల్తానాబాద్ పెద్ద చెరువు ప్రమాద స్థాయికి చేరింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-07-13T15:28:27+05:30 IST