విశాఖ: సజీవ దహనం ఘటనపై కీలక విషయాలు వెల్లడించిన సీపీ

ABN , First Publish Date - 2021-04-15T16:52:06+05:30 IST

విశాఖ నగరంలోని ఎన్నారై కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి...

విశాఖ: సజీవ దహనం ఘటనపై కీలక విషయాలు వెల్లడించిన సీపీ

విశాఖపట్నం : విశాఖ నగరంలోని ఎన్నారై కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌లోని ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు థాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. అయితే.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత అసలేం జరిగింది..? అనే దానిపై నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు.


సీపీ మాటల్లోనే... 

505 ప్లాట్‌లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఇంట్లో ఘర్షణ జరుగుతున్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళు తెలిపారు. సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలించాం. చివరిగా 505 ప్లాట్‌లోకి  నిన్న రాత్రి 8:56 గంటలకు తండ్రి ఇంట్లోకి వెళ్ళారు. కుటుంబ కలహాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము. పెద్ద కుమారుడు మినహా ముగ్గురికి వంటిపై గాయాలు ఉన్నాయి. పెద్ద కుమారుడు వారిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పెద్ద కుమారుడు ఒక దగ్గర, మిగతా ముగ్గురు ఒక దగ్గర పడి ఉన్నారు. పూర్తి స్థాయిలో కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద కుమారుడు దీపక్ మానసిక సమస్యతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద కుమారుడే కుటంబ సభ్యలను హత్య చేసి తాను సజీవ దహనం చేసుకున్నట్లు  అనుమానంగా ఉంది అని సీపీ మీడియాకు వెల్లడించారు. కాగా.. సుంకరి బంగారి నాయుడు కుటుంబం స్థిరపడగా.. ఎనిమిది నెలల క్రితం ఆదిత్య టవర్స్‌లోకి ఎన్నారై కుటుంబం అద్దెకు వచ్చింది. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గంట్యాడగా స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇవాళ మధ్యాహ్నానికి అసలేం జరిగింది..? దీని వెనుక ఎవరున్నారు..? అనేదానిపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

Updated Date - 2021-04-15T16:52:06+05:30 IST