వెలుగులోకి.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో

ABN , First Publish Date - 2022-01-08T17:56:24+05:30 IST

కుటుంబంతో సహా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణకు సంబంధించి....

వెలుగులోకి.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో

కొత్తగూడెం, జనవరి (ఆంద్రజ్యోతి): కుటుంబంతో సహా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణకు సంబంధించి మరో సెల్ఫీ వీడియో శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. తాను చిన్నతనంలో ఉన్నప్పుడే తన తండ్రి చిట్టబ్బాయి.. నక్సలైట్ల దాడిలో మరణించాడని ఈ వీడియోలో రామకృష్ణ చెప్పాడు. ‘‘మా నాన్న చిట్టబ్బాయి మోతుగూడెంలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు.


1992 అక్టోబరు 27న ఆఫీసు పనిపై డొంకరాయి గ్రామానికి వెళ్లి వస్తుండగా మోతుగూడెం పోలీసులు రోడ్డుమీద మానాన్న వస్తున్న వాహనం ఆపి లిఫ్ట్‌ అడిగారు. ఒకేఊరు కావడంతో లిఫ్ట్‌ ఇవ్వగా పోలీసు వాహనం అనుకుని నక్సలైట్లు బాంబ్‌ బ్లాస్ట్‌ చేయడంతో మా నాన్న సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. ప్రధానంగా నేను ఈ పరిస్థితికి రావడానికి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కారణం మొదటి సూత్రధారి వనమా రాఘవ. ఆయనకు, మా అక్క కొమ్మిశెట్టి లోభమాధవికి సంబంధం ఉంది. మా అమ్మ కూడా సహకరిస్తూ ఆస్తిలో వాటా విషయంలో ఒప్పందాలు చేసుకున్నాక కూడా వాటిని ఇవ్వకుండా అప్పుల ఊబిలోకి నెట్టి చావే మార్గమనే పరిస్థితికి తీసుకొచ్చారు’’ అంటూ పదకొండున్నర నిమిషాలకుపైగా నిడివి ఉన్న వీడియోలో నాగరామకృష్ణ వివరించాడు.



Updated Date - 2022-01-08T17:56:24+05:30 IST