Jul 1 2021 @ 00:59AM

మందిరా బేడీ భర్త... దర్శకనిర్మాత రాజ్‌ మృతి

హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత రాజ్‌ కౌశల్‌ బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన హిందీ నటి, యాంకర్‌ మందిరా బేడీ భర్త. ఆయన వయసు 49 ఏళ్లు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రచయితగా కెరీర్‌ ప్రారంభించిన రాజ్‌ కౌశల్‌, సహాయ దర్శకుడిగా, స్టంట్‌ కో-ఆర్డినేటర్‌గా పని చేశారు. ‘ప్యార్‌ మే కభీ కభీ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. తర్వాత మరో రెండు చిత్రాలు ‘షాదీ కా లడ్డూ’, ‘ఆంటోనీ కౌన్‌ హై’కు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా తొలి రెండూ చిత్రాలనూ స్వీయ నిర్మాణంలో చేశారు. నిర్మాతగా ‘మై బ్రదర్‌ నిఖిల్‌’ చేశారు. రాజ్‌, మందిరా దంపతులకు ఓ బాబు వీర్‌, ఓ పాప తారా ఉన్నారు. వీర్‌ సంతానం కాగా, తారాను దత్తత తీసుకున్నారు. రాజ్‌ మృతి పట్ల పలువురు హిందీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Bollywoodమరిన్ని...