కర్ణాటకకు పాకిన Mandir-masjid వివాదం

ABN , First Publish Date - 2022-05-28T17:45:39+05:30 IST

జ్ఞానవాపి మందిర్-మసీదు వివాదం ఇప్పుడు కర్ణాటక అంతటా వ్యాపించింది....

కర్ణాటకకు పాకిన Mandir-masjid వివాదం

మాండ్యా జామియా మసీదు కాదు...హనుమాన్ దేవాలయం : హిందూ విశ్వ పరిషత్

మాండ్యా(కర్ణాటక): జ్ఞానవాపి మందిర్-మసీదు వివాదం ఇప్పుడు కర్ణాటక అంతటా వ్యాపించింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాండ్యా నుంచి బీదర్ వరకు అనేక మందిర్-మసీదు వివాదాలు మొదలయ్యాయి.మాండ్యా నగరంలోని జామియా మసీదులో ఆంజనేయ విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని మాండ్యా డిప్యూటీ కమిషనర్‌కు రైట్‌వింగ్ ఆర్గనైజేషన్ కార్యకర్తలు మెమోరాండం దాఖలు చేశారు.ఈ మసీదు నిజానికి ఒక దేవాలయమని, దానిని మసీదుగా మార్చారని హిందూ కార్యకర్తలు పేర్కొన్నారు. మసీదులో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.ఆంజనేయ స్వామి ఆలయంపైనే జామియా మసీదు నిర్మించారని హిందూ కార్యకర్తలు ఆరోపించారు. 


ఆ మసీదు ఆంజనేయ ఆలయమని చారిత్రక ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.టిప్పు సుల్తాన్ పర్షియా ఖలీఫ్ రాజుకు రాసిన లేఖలో దీని గురించి రాశారని, పురావస్తు శాఖ పత్రాలను పరిశీలించి ఈ విషయంపై దర్యాప్తు చేయాలని  హిందూ విశ్వ పరిషత్ డిమాండ్ చేసింది. మాండ్యాలోని జామియా మసీదు నిర్వహిస్తున్న మదర్సాను ఖాళీ చేయాలని హిందూ విశ్వ పరిషత్ డిమాండ్ చేసింది. 

  

Updated Date - 2022-05-28T17:45:39+05:30 IST