Mathura Vrindavan ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం యోగి హామీ

ABN , First Publish Date - 2021-12-30T17:58:02+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి చెందిన ప్రస్థుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త హామీ ఇచ్చారు....

Mathura Vrindavan ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం యోగి హామీ

అమ్రోహ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి చెందిన ప్రస్థుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త హామీ ఇచ్చారు.అయోధ్య రామాలయం, వారాణసీ కాశీవిశ్వనాథుని ఆలయాల తరహాలో మధురలోని బృందావన్ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమ్రోహ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చి పనులు ప్రారంభించామని సీఎం చెప్పారు. వారణాసీలో కాశీవిశ్వనాథుని ఆలయ కారిడార్ ను నిర్మించామని, మధురలోని బృందావన్ ఆలయాన్ని ఎలా వదిలివేస్తామని సీఎం యోగి ప్రశ్నించారు. మధురలోని బృందావనం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం యోగి హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-12-30T17:58:02+05:30 IST