అన్ని వర్గాలపై పన్నుల బాదుడే : మండలి ధ్వజం

ABN , First Publish Date - 2022-07-07T06:02:48+05:30 IST

జగన్మోహన్‌ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, చార్జీలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్య తరగతి వర్గాలు మనుగడ సాధించలేని పరిస్థితులు ఉన్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ విమర్శించారు.

అన్ని వర్గాలపై  పన్నుల బాదుడే : మండలి ధ్వజం

నాగాయలంక  : జగన్మోహన్‌ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, చార్జీలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్య తరగతి వర్గాలు మనుగడ సాధించలేని పరిస్థితులు ఉన్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ విమర్శించారు. నాలి, బర్రంకుల గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జగనన్న బాదుడే బాదు డు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, గొరిపర్తి రాంప్రసాద్‌, చిట్టా శ్రీనివాసరావు, బావిరెడ్డి వెంకటేశ్వరరావు, కొప్పనాతి వెంకట్రామయ్య, చిన వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, తాతారావు, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. 

దిరిశవల్లిలో నిరసన

పెడన రూరల్‌ : ప్రభుత్వ  దుర్మార్గపు విధానాలతో ప్రజలందరూ ఇక్కట్ల పాలవుతున్నారని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు.  దిరిశవల్లి గ్రామంలో బుధవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.  రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తూ, అధికార పార్టీ నాయకులు దోచుకుం టున్నారని కృష్ణప్రసాద్‌ విమర్శించారు. రైతులకు న్యాయం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. జడ్పీటీసీ సభ్యుడు అర్జా నగేష్‌, శలపాటి ప్రసాద్‌, పామర్తి వెంకటేశ్వరరావు, శీరం ప్రసాద్‌, బొల్లా నాగేశ్వరరావు, పి.రాంబాబు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-07T06:02:48+05:30 IST