జిల్లాల విభజనపై తగిన మూల్యం తప్పదు: బుద్ధప్రసాద్‌

ABN , First Publish Date - 2022-02-20T03:09:19+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం ఎలా అశాస్త్రీయంగా విభజించిందో.. నేడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో అదే

జిల్లాల విభజనపై తగిన మూల్యం తప్పదు: బుద్ధప్రసాద్‌

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం ఎలా అశాస్త్రీయంగా విభజించిందో.. నేడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో అదే తరహాలో విభజన చేస్తున్నదని, గతంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే వైసీపీ ప్రభుత్వానికి కూడా పడుతుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక జిల్లా ఏర్పాటులో ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కృష్ణాజిల్లాను రెండుగా విభజించి కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఏలూరులో కలిపారన్నారు. వందల సంవత్సరాలుగా జిల్లాతో అనుబంధం పెంచుకున్న ఈ ప్రాంత ప్రజలను వేరే ప్రాంతానికి మార్చటం తగదని సూచించారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా సహేతుకం కాదన్నారు.  పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అశాస్త్రీయంగా విభజన చేస్తున్నారని, దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, వాటి వల్ల తలెత్తే సమస్యలపై కులంకుషంగా చర్చించి నిర్ణయాలను తీసుకోవాలని బుద్ధప్రసాద్‌ సూచించారు.

Updated Date - 2022-02-20T03:09:19+05:30 IST