కళా వెంకట్రావు అరెస్ట్‌తో పోలీస్ వ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోయింది: బుద్ధ ప్రసాద్

ABN , First Publish Date - 2021-01-21T17:43:27+05:30 IST

సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి కళా వెంకట రావు అరెస్ట్ ద్వారా మరోసారి పోలీస్ వ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

కళా వెంకట్రావు అరెస్ట్‌తో పోలీస్ వ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోయింది: బుద్ధ ప్రసాద్

కృష్ణా: సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి కళా వెంకట రావు  అరెస్ట్ ద్వారా మరోసారి పోలీస్ వ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మన రాష్ట్ర రాజకీయాల్లో సౌమ్యుడుగా, పెద్దమనిషిగా అందరిచేత గౌరవింపబడే కళా వెంకట్రావుని అరెస్టు చేసిన తీరు పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మసక బార్చిందని తెలిపారు. రాష్టంలో అనేక కేసుల్లో ఈరోజుకి కూడా దోషులను పట్టుకోని కేసులు అనేకం ఉన్నాయన్నారు. స్వయాన ముఖ్యమంత్రి  పినతండ్రి  వైయస్.వివేకానందరెడ్డి హత్య దగ్గర నుంచి అవనిగడ్డలో దాదాపు రెండు నెలలు క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య వరకు దోషులను పట్టుకోని కేసులు అనేకం ఉన్నాయని చెప్పారు.  వాటిని చేధిస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కుదురుతుందన్నారు. వ్యవస్థల పట్ల నమ్మకం పోతే ప్రజాస్వామ్యం నిరర్ధకమవుతుందని మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-21T17:43:27+05:30 IST