Abn logo
Apr 21 2021 @ 00:11AM

నాగిరెడ్డిపేటలో మండల సమాఖ్య ఆడిట్‌

నాగిరెడ్డిపేట, ఏప్రిల్‌ 20: నాగిరెడ్డిపేటలోని మండల సమాఖ్య కార్యాల యంలో 2020-21 సంవత్సరానికి గాను మంగళవారం మండల సమాఖ్య, గ్రామ సంఘాల ఆడిట్‌ నిర్వహించారు. ఆడిటర్‌ ఇప్పకాయల రమేష్‌ మా ట్లాడుతూ మండల సమాఖ్య, గ్రామ సంఘాల ద్వారా నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన జమ ఖర్చులు, ఆదాయ వ్యయాలను ఆడిట్‌ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జగదీష్‌ కుమార్‌, సిసిలు దత్తు, రమేష్‌, నారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, రషీద్‌, సుజాత, స్వామి అకౌంటెంట్‌ రాజు, ఆపరేటర్‌లు, గ్రామ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement