మండల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T04:33:57+05:30 IST

మండల అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఆయా శాఖ ల అధికారులకు మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి సూచించారు.

మండల అభివృద్ధే లక్ష్యంగా పని  చేయాలి
మండల సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మండల అభివృద్ధే లక్ష్యంగా పని  చేయాలి

ఆత్మకూర్‌, ఆగస్టు 19: మండల అభివృద్ధే లక్ష్యంగా  విధులు నిర్వహించాలని ఆయా శాఖ ల అధికారులకు మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి సూచించారు. ఎంపీపీ బంగారు శ్రీని వాసులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.   రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, శిశు సంక్షేమ, విద్యుత్‌ శాఖల అభివృద్ధి నిమిత్తం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు.  అధికారులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గత సమావేశంలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించి నా.. నేటివరకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామాలలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే డీ-6 కాలువ క్రస్టు గేట్లు మరమ్మతులు చేయించి తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందించాలని  గత సమావేశంలో ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు పూర్తి చేయని కారణంగా చివరి ఆయక ట్టు వరకు అందకపోవడతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులపై మండిపడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని విడుదల చేసే విధంగా చూ డాలని ఆదేశించారు. అనంతరం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడే ముందు  ఆయా శాఖల అధికారులు నివేదికలను సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ శివరంజని, తహసీల్దార్‌ మతిన్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, సింగిల్‌ విం డో అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మికాంతరెడ్డి, మార్కె ట్‌ చైర్మన్‌ రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-08-20T04:33:57+05:30 IST