Jun 22 2021 @ 00:20AM

‘మా’ అధ్యక్ష పోటీలో మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు సెప్టెంబర్‌ నెల్లో జరుగనున్నాయి. అయితే వంద రోజుల ముందే ఎన్నికల వేడి మొదలైంది. అధ్యక్ష పదవికి తను పోటీ పడుతున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించిన 24 గంటల్లోపే  ఆ పదవి కోసం తనూ పోటీలో ఉన్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. దీంతో ఈసారి కూడా ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే ఆర్టిస్టులందరికీ మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తండ్రి డాక్టర్‌ మోహన్‌బాబు ఆశీస్సులతో పాటు సీనియర్‌ హీరోలు కృష్ణ, కృష్ణంరాజు, ఇతర నటీనటులను సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు విష్ణు. ‘మా’ సభ్యుల సంక్షేమం, ‘మా’కు సొంత భవనం ఏర్పాటుకు కృషి.. ఈ రెండు అంశాలు ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు.