Oct 20 2021 @ 09:00AM

Manchu vishnu: బన్నీ అంటే అసూయ కలిగింది

బన్నీ అంటే అసూయ కలిగిందని అన్నారు హీరో, 'మా' అధ్యకుడు మంచు విష్ణు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మంచు విష్ణు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘మా’ ఎన్నికలతో పాటు మెగా కుటుంబంతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా, బన్నీ తనకు మంచి మిత్రుడని, ఇద్దరం రెగ్యులర్‌గా చాటింగ్ చేసుకుంటూ ఉంటామని తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇదే సమయానికి బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్ ఖాన్‌ - టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన పలు మ్యాగజైన్స్‌, వార్త పత్రికలు హీరో అల్లు అర్జున్‌, అమీర్ ఖాన్‌కు పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో గర్వపడ్డానని మంచు విష్ణు అన్నారు.