Oct 27 2021 @ 11:21AM

నా రెండో పెళ్ళికి నన్నుకూడా పిలవండి : మంచు మనోజ్

మంచు మనోజ్ రెండో పెళ్ళి చేసుకుంటున్నారని, కుటుంబ సభ్యులు పిల్లని వెతికారని కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మనోజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చాలా వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నవారిపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. మనోజ్ ఒక విదేశీ యువతిపై ప్రేమలో ఉన్నారని, దాన్ని కాదని తండ్రి మోహన్ బాబు వారి బంధువుల అమ్మాయితో ఆయనకి రెండో పెళ్ళి జరిపించాలని ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. 



తనపై వస్తున్న ఇలాంటి కథనాల్ని షేర్ చేస్తూ మనోజ్.. చాలా సెటైరికల్ గా వారికి సమాధానం చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘దయచేసి నా రెండో పెళ్ళికి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్ళి ఎక్కడ? ఎవరా బుజ్జి పిల్ల.. తెల్లపిల్ల? మీ ఇష్టం రా.. అంతా మీ ఇష్టం’.. అంటూ బ్రహ్మానందం.. అయోమయంగా రియాక్షన్ ఇచ్చే ఒక ఫోటోను ఆ ట్వీట్ కు జోడించారు. 2015 లో ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్న మనోజ్.. ఆమెకు 2019 లో విడాకులు ఇచ్చారు.  ఆ పై సినిమాలనుంచి కూడా తప్పుకున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆయన్ని సముదాయించడంతో తిరిగి సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం మనోజ్ తన సొంత నిర్మాణంలో ‘అహం బ్రహ్మస్మి’ మూవీలో నటిస్తున్నారు.