Abn logo
Apr 10 2020 @ 17:00PM

వారి కోసం.. మేనకోడలితో కలిసి మంచు మనోజ్ పాట

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోలలో మంచు మనోజ్ ఒకరు. ప్రతి విషయానికి తనదైన కోణంలో సోషల్ మీడియాలో స్పందించే మంచు మనోజ్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ఎన్నో విధాలుగా హెచ్చరికలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకుందామని అనుకున్న మనోజ్‌ని కరోనా ఇంకెంత కాలం వెయిట్ చేసేలా చేసింది. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపిన మనోజ్.. ఈ కష్టకాలంలో ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వారి కోసం ఓ పాటను తన మేనకోడలితో కలిసి పాడబోతున్నట్లుగా తెలిపారు. ఈ పాటకు అచ్చు సంగీతం అందించనున్నారు.


‘‘మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమాతో మిమ్మల్ని పలుకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. ‘యాక్షన్’ అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు, ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను. అచ్చు మ్యూజిక్ డైరెక్షన్లో ‘అంతా బాగుంటాంరా’ అని నేను, నా మేనకొడలు విద్యానిర్వాణ కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది. ఇప్పటికే చాలా వాటికోసం ఎదురు చూస్తున్నారు. కష్టం అయినా వచ్చే వారం వరకూ ఆగండి. అంతా బాగున్నారా..’’ అని మంచు మనోజ్ తన ట్వీట్‌లో తెలిపారు.



Advertisement
Advertisement
Advertisement