Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 03 Mar 2022 20:17:48 IST

నాగ శ్రీనుకు నాగబాబు సాయం.. మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదే!

twitter-iconwatsapp-iconfb-icon

హీరో మంచు విష్ణు కార్యాలయంలో రూ. 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామాగ్రిని హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను దొంగతనం చేసినట్లుగా నమోదైన కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగ శ్రీను ఈ విషయాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. తననే దూషించి, తీవ్రంగా అవమానించారని.. అందుకే అక్కడ ఉద్యోగం మానేసినట్లుగా తెలుపుతూ.. ఓ వీడియోని విడుదల చేయడంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య ‘మా’ ఎన్నికల నుండి ఎటువంటి వాతావరణం ఉందో తెలియంది కాదు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతున్న నాగ శ్రీనుకు.. తాజాగా మెగాబ్రదర్ నాగబాబు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించి.. ప్రస్తుత విషయాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చారు. 


హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడనే విషయం తెలిసి.. నటుడు నిర్మాత నాగబాబు చిరు సాయంగా 50,000/- రూపాయలు అందించారు. అలాగే నాగ శ్రీను కుమార్తెల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి ఎటువంటి సమస్య లేకుండా పూర్తి వైద్య సహాయం కోసం అపోలో ఆసుపత్రి సహకారంతో.. ఫ్రీ మెడికల్ చెకప్ చేసే సకల ఏర్పాట్లను చేసి, అతని కుటుంబానికి నాగబాబు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నాగబాబు సాయం చేసింది మంచికే అయినా.. మంచు ఫ్యామిలీ మాత్రం దీనిని తీవ్రంగా చూస్తోంది. నాగబాబు సాయం గురించి తెలిసిన తర్వాత.. ‘‘ప్రతి నెల మా సంస్థ నుంచి అతనికి కరెక్ట్‌గానే శాలరీ డిపాజిట్ చేయడం జరిగింది. గత నెల కూడా శాలరీ డిపాజిట్ చేశాము’’ అని మంచు ఫ్యామిలీ తరపు పీఆర్ తెలపడం గమనార్హం.

నాగ శ్రీనుకు నాగబాబు సాయం.. మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదే!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement