మంచిర్యాల జిల్లా: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని తన వర్గం నేతలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. దీంతో ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంచిర్యాల చేరుకున్నారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు.