Singareniలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు

ABN , First Publish Date - 2022-05-04T21:53:03+05:30 IST

మంచిర్యాల: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి.

Singareniలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు

Manchiryala: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. ఇదే సమయంలో సింగరేణిపై ఒత్తిడి పెరుగుతోంది. బొగ్గు ఉత్పత్తి పెంపులో పేలుడు పదార్థాల కొరతతో సింగరేణిని వేధిస్తోంది. మరోవైపు విద్యుత్ సంక్షోభం ముదురుతున్న సమయంలో ఉత్పత్తిని పెంచేందుకు సింగరేణి తీవ్రంగా శ్రమిస్తోంది.


దేశంలో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. సరిపడ బొగ్గు సరఫరా లేకపోవడంతో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇదే సమయంలో సింగరేణికి థర్మల్ విద్యుత్ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవలే ఎన్టీసీపీ యాజమాన్యం బొగ్గు రవాణా పెంచాలని ఆదేశించింది. ఎన్టీపీసీ సంస్థకు సింగరేణి యాజమాన్యం 21.7 మిలియన్ టన్నుల బొగ్గును ఏటా సరఫరా చేస్తోంది. రామగుండంలో కొత్తగా నిర్మిస్తున్న 8 వందల మెగావాట్ల రెండు యూనిట్లకు 6.80 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు సింగరేణి ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రామగుండం, కుడిగి, సోలాపూర్ ఫ్లాంట్లకు సరఫరా పెంచాలని ఎన్టీపీసీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వీటితోపాటు మిగతా సంస్థల నుంచి కూడా బొగ్గు డిమాండ్ పెరుగుతోంది.

Read more