మంచిర్యాల: చెన్నూరులో నకిలీ బంగారు బిస్కెట్ల దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ హల్‌మార్క్ అచ్చులతో బంగారు బిస్కెట్లు అమ్ముతున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణకార సంఘం ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాణ్యతలేని బంగారంతో రూ.కోట్లు దండుకుంటున్నట్లు పోలీసులకు స్వర్ణకార సంఘం ఫిర్యాదు చేసింది. రంగంలోని దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.