Oct 28 2021 @ 09:13AM

'మంచి రోజులు వచ్చాయి': సెన్సార్ పూర్తి

యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్‌ జంటగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'మంచి రోజులు వచ్చాయి'. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను బాగానే పెంచాయి. కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో నిర్మిస్తున్న దీనికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.