జట్లకొండూరులో మంచినీటికి అవస్థలు

ABN , First Publish Date - 2021-01-27T03:06:24+05:30 IST

తమ కాలనీకి మూడు రోజులుగా మంచినీరు రావడం లేదని, తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వస్తోందని జట్లకొండూరు అరుంధతీవాడ

జట్లకొండూరులో మంచినీటికి అవస్థలు

   మనుబోలు, జనవరి 26: తమ కాలనీకి మూడు రోజులుగా మంచినీరు రావడం లేదని, తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వస్తోందని జట్లకొండూరు అరుంధతీవాడ వాసులు మంగళవారం వాపోయారు. తాగునీటి కోసం పొలాలవద్ద ఉన్న మోటార్లనుంచి నీటిని బిందెల్లో, క్యాన్లలో పట్టుకుని అరకిలోమీటరు దూరం నడవాల్సి వస్తోందని మహిళలు, చిన్నారులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడైనా ట్యాంకరు ద్వారా నీళ్లు ఇస్తే మాకు తిప్పలు తప్పుతాయని వాపోయారు. 


Updated Date - 2021-01-27T03:06:24+05:30 IST