Telangana: బెల్లంపల్లి రీజియన్‌లోని గనుల్లో సమ్మె సంపూర్ణం

ABN , First Publish Date - 2021-12-09T14:00:43+05:30 IST

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా బొగ్గు కార్మికులు చేపట్టి 72 గంటల సమ్మె కొనసాగుతోంది.

Telangana: బెల్లంపల్లి రీజియన్‌లోని గనుల్లో సమ్మె సంపూర్ణం

మంచిర్యాల: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా బొగ్గు కార్మికులు చేపట్టి 72 గంటల సమ్మె కొనసాగుతోంది. బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాం పూర్, బెల్లం పల్లి, మందమర్రి ఏరియా గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. ఆర్కే 7 బొగ్గు గని వద్ద కార్మిక సంఘాలు నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య నిరసనలో పాల్గొని ప్రసంగించారు.  కేంద్రం నిర్ణయంతో సింగరేణి మనుగడకే ప్రమాదం జరుగనుందని, కార్మికుల భవిష్యత్‌కు ముప్పు పొంచి ఉందని అన్నారు. భేషరతుగా వేలం నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయని వాసిరెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-09T14:00:43+05:30 IST