Advertisement
Advertisement
Abn logo
Advertisement

Telangana: సింగరేణిలో మ్రోగిన సమ్మె సైరన్

మంచిర్యాల: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా 72 గంటల పాటు కార్మికులు సమ్మె చేయనున్నారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను  కేంద్రం వేలం జాబితాలో చేర్చడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.  సమ్మెలో 40వేల మంది రెగ్యులర్,25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి  నిలిచిపోయింది. 


పెద్దపల్లి జిల్లా రామగుండం రీజీయన్‌లో ఆరు భూగర్భగనులు, నాలుగు ఓసిపిలలో పి షిప్ట్ నుండి సమ్మె ప్రారంభమైంది. కార్మికులు విధులు హాజరుకాకపోవడంతో గనులు బోసిపోతున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలంటు కార్మికసంఘాల ర్యాలీ చేపట్టాయి. 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్ పరిధిలో కార్మికులు లేక  బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి. 

Advertisement
Advertisement