Abn logo
Aug 5 2020 @ 04:15AM

మంచిర్యాల ఎన్నిక నేడు

బరిలో 14 మంది  


మంచిర్యాలటౌన్‌: మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నికను బుధవారం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో టెలీ కాన్ఫరెన్స్‌ విధానంలో చైర్మన్‌ చాంబర్‌లో ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. నాలుగు కోఆప్షన్‌ పదవుల కుగాను ఈనెల 23న గడువు ముగిసే సమయానికి 15 దరఖాస్తులు వచ్చాయి. జనరల్‌ విభాగంలో 9, మైనా ర్టీ విభాగంలో 6 దరఖాస్తులు ఉన్నాయి. మైనార్టీ విభాగానికి సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం జత చేయనుందున అధికారులు తిరస్కరించారు. 


టీఆర్‌ఎస్‌ నుంచి 4 దరఖాస్తులు

మున్సిపల్‌ కోఆప్షన్‌ పదవులకు అధికార టీఆర్‌ఎస్‌ నుంచి రెండు విభాగాల్లో 4 పదవులకుగాను నాలుగు దరఖాస్తులే వచ్చాయి.  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆశీస్సులు ఉన్నవారే కోఆప్షన్‌ పదవులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కోఆప్షన్‌ పదవులకు అధికార పార్టీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడినా, చివరి నిమిషంలో ఎమ్మెల్యే సూచించిన వారే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వసుంధర భర్త మామిడిశెట్టి రమేష్‌, మాజీ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ హండే సతీమణి, మాజీ కౌన్సిలర్‌ సుగుణ హండే దరఖాస్తు చేశారు. అలాగే మైనార్టీ విభాగంలో రెండు పదవులకు ఎండీ జాఫర్‌ హుస్సేన్‌, అస్ఫియా సుల్తానా దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎన్నిక లాంఛనమే కానుంది.

Advertisement
Advertisement