Abn logo
Sep 22 2021 @ 07:24AM

సెల్ఫీ మోజులో బియాస్ నదిలోకి దిగిన ఇద్దరు పర్యాటకులు... ఇంతలో...

మనాలి: హిమాచల్‌ ప్రదేశ్‌లోని పర్యాటక నగరం మనాలిలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఇద్దరు టూరిస్టులు ఊహించని పరిస్థితుల్లో మృత్యుఒడికి చేరారు. మనాలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బియాస్ నదిలో ఒక మహిళ, ఆమె కుమారుడు మునిగిపోయారని స్థానిక హోటల్ ప్లేయర్ గ్రాండ్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ పోలీసులు... ఒక మహిళతో పాటు బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఢిల్లీకి చెందిన ప్రీతి భసీన్(37), పులకిత్ భసీన్(12)గా గుర్తించారు. బియాస్ నదిలో దిగిన వీరు సెల్ఫీ తీసుకుంటుండగా పడిపోయారు. దీనిని గమనించిన ఒక వ్యక్తి వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోయింది. కాగా వీరి మృతదేహాలు సంఘటనా స్థలానికి మూడునాలుగు కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption