నగరేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ మనగుడి

ABN , First Publish Date - 2021-10-17T05:42:17+05:30 IST

స్థానిక శ్రీరామ శ్రీకన్యకా పరమేశ్వరి శ్రీనగరే శ్వరస్వామి ఆలయం (కొత్తగుళ్లు) లో శుక్రవారం టీటీడీ ఽధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాలు ఆధ్మాత్మిక వాతావరణంలో నిర్వహించారు.

నగరేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ మనగుడి
ప్రసంగిస్తున్న ముఖ్యఅతిథి దుర్గాప్రసాద్‌

నగరేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ మనగుడి 

వన్‌టౌన్‌, అక్టోబరు 16: స్థానిక శ్రీరామ శ్రీకన్యకా పరమేశ్వరి శ్రీనగరే శ్వరస్వామి ఆలయం (కొత్తగుళ్లు) లో శుక్రవారం టీటీడీ ఽధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాలు ఆధ్మాత్మిక వాతావరణంలో నిర్వహించారు. దేవదాయశాఖ రిటైర్డ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ దుర్గాప్రసాద్‌, ప్రచార మండలి సభ్యుడు బొగ్గరపు వెంకట బాల కోటేశ్వరరావులు సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పంతుల వెంకటేశ్వరరావు దసరా మహోత్సవాల విశిష్టత, శమీ పూజ ఫలితాలు వివరించారు. అనంతరం ఆయననను ముఖ్య అతిథులు సత్కరించారు. ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌ విద్యార్థులు అక్షయ, గురుమీనాక్షిలు భక్తి ప్రపూరిత నాట్యం చేశారు. అనంతరం వీరికి జ్ఞాపికలు అందజేశారు. ఆలయ జనరల్‌ కార్యదర్శి శివకుమార్‌ సముచిత రీతిని సత్కారాలు నిర్వహిం చారు. కోదండరామాలయం అర్చకుడు పరాశరం రాఘవాచార్యులు సువాసినిలచే పూజలు,  కుంకుమా ర్చన చేయించారు. టీటీడీ తరఫున భక్తులకు  కుంకుమ, రూపు, గోవిందనామాలు సీడీలు అందజేశారు. ధర్మప్రచార మండలి సభ్యులు అమ్మాజీ, ధర్మాచార్యులు రాజేశ్వరి, జిల్లా ఇన్‌చార్జి సీవీకే ప్రసాద్‌ పాల్గొన్నారు. 







Updated Date - 2021-10-17T05:42:17+05:30 IST