5 స్టార్ హోటల్‌లో ఒక పెద్ద పార్టీ.. చిన్నపిల్లాడితో గెస్ట్‌గా వచ్చిన యువకుడు.. అందరూ చూస్తుండగా ఎంతపని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-16T06:48:14+05:30 IST

పెళ్లి కార్యక్రమాలు.. పార్టీలంటే చాలా హడావుడిగా ఉంటుంది. ఈ హంగామా మధ్యలో చాలాసార్లు గొడవలు, దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. అయితే ధనికుల ఇళ్లో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు చాలా పకడ్బందీగా జరుగుతుంటాయి. ఎలాంటి దొంగతనాలు జరగకుండా సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాట్లు ఉంటాయి...

5 స్టార్ హోటల్‌లో ఒక పెద్ద పార్టీ.. చిన్నపిల్లాడితో గెస్ట్‌గా వచ్చిన యువకుడు.. అందరూ చూస్తుండగా ఎంతపని చేశాడంటే..

పెళ్లి కార్యక్రమాలు.. పార్టీలంటే చాలా హడావుడిగా ఉంటుంది. ఈ హంగామా మధ్యలో చాలాసార్లు గొడవలు, దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. అయితే ధనికుల ఇళ్లో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు చాలా పకడ్బందీగా జరుగుతుంటాయి. ఎలాంటి దొంగతనాలు జరగకుండా సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఎంత సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ.. దొంగలు తమ పని ఎంతో చాకచక్యంగా పూర్తిచేస్తారు. తాజాగా ఇలాంటి ఒక ఘటన బీహార్‌లో జరిగింది.


బీహార్ రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో ఇటీవల పోలీసులకు వరుసగా దొంగతనాల ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిలో ఎక్కువగా పెళ్లి కార్యక్రమాలలోనే దొంగతనాలు జరుగుతున్నట్లు తేలింది. తాజాగా ఒక 5 స్టార్ హోటల్‌లో ఒక  ఎంగేజ్మెంట్(నిశ్చితార్థం) కార్యక్రమం జరిగింది. అక్కడ పెళ్లి కొడుకు తల్లి పర్సు ఎవరో కాజేశారు. అందులో రూ.2 లక్షల విలువగల బంగారు నగలు, రూ.15 క్యాష్ ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆ పర్సు ఎలా దొంగిలించబడిందని సీసీటీవి వీడియో పరిశీలించారు.


అందులో ఆ పర్సు కాజేసింది.. ఒక 12 ఏళ్లా బాలుడని స్పష్టంగా కనపడింది. పెళ్లి కొడుకు తల్లి ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో వచ్చిన మహిళా గెస్ట్లను పలకరిస్తూ.. తన చేతిలో ఉన్న పర్సును కాసేపు పక్కన టేబుల్ పై పెట్టి స్టేజిపై ఉన్న వధూవరుల వద్దకు వెళ్లింది. ఆమె వెళ్లిన కాసేపటికే ఒక 12 ఏళ్ల కుర్రాడు ఆ పర్సు ఉన్న టేబుల్ వద్దకు వచ్చి చాలా స్పీడుగా ఆ పర్సుని తీసుకొని బయటకు వెళ్లిపోయాడు.


సీసీటీవి మరోసారి ముందు నుంచి చూస్తే.. ఆ బాలడు ఒంటరిగా కాకుండా.. అతనితో ఒక యువకుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడు, యువకుడు ఇద్దరూ చాలా ఖరీదైన బట్టలు వేసుకొని ఆ పార్టీకి వచ్చారు. పార్టీ మొదలైనప్పటి నుంచి ఆ బాలుడు, యువకుడు మహిళలు వేసుకొని ఉన్న బంగారు నగలవైపే చూస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తల్లి తన పర్సు మరిచిపోయి వెళ్లడం చూసి.. వెంటనే కాజేశారు.


పోలీసులు ప్రస్తుతం ఆ యువకుడు, బాలుడి కోసం గాలిస్తున్నారు.



Updated Date - 2022-02-16T06:48:14+05:30 IST