కరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్నయువకుడు అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-04T22:47:53+05:30 IST

అనే వ్యక్తిని మాలేగావ్‌లో గురువారం అరెస్ట్ చేశారు. కరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్న వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది.

కరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్నయువకుడు అరెస్ట్

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి కరెన్సీ నోట్లతో తన ముక్కు, నోరు తుడుచుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో రాష్ట్రంలోని నాశిక్‌కు చెందిన సయ్యద్ జమాల్ సయ్యద్ బాబు (38) అనే వ్యక్తిని మాలేగావ్‌లో గురువారం అరెస్ట్ చేశారు. కరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్న వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది.


‘‘అతడి వీడియో వైరల్ అయింది. విషయం మాకు తెలియగానే అతడిని అరెస్ట్ చేశాం. మాలేగావ్ కోర్టు ఆదేశాల మేరకు అతడిని ఏప్రిల్ 7 వరకు కస్టడీలోనే ఉంచుతాం’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.


మహారాష్ట్రలో కరోనా కేసులు 423కు చేరుకున్నాయి. కాగా రాష్ట్రంలో 19 మంది కరోనా వల్ల మరణించారు. ఇక దేశంలో కరోనా కేసులు 2,902కు పెరిగాయి. కాగా 2,650 ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన డాటా పేర్కొంది. ఇక కరోనా వల్ల దేశ వ్యాప్తంగా 68 మంది మరణించగా, 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-04-04T22:47:53+05:30 IST