30 ఏళ్లుగా అదే నంబర్ లాటరీ టిక్కెట్... ఎట్టకేలకు నెరవేరిన కల!

ABN , First Publish Date - 2021-08-28T18:03:13+05:30 IST

లాటరీ టిక్కెట్లు కొనడం జూదానికి ఏమాత్రం తక్కువకాదు.

30 ఏళ్లుగా అదే నంబర్ లాటరీ టిక్కెట్... ఎట్టకేలకు నెరవేరిన కల!

వాషింగ్టన్: లాటరీ టిక్కెట్లు కొనడం జూదానికి ఏమాత్రం తక్కువకాదు. కొంతమంది ఏళ్ల తరబడి లాటరీ టిక్కెట్లు కొంటూ తమను ఎప్పటికైనా అదృష్టం వరించకపోతుందా... అని ఎదురు చూస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక వ్యక్తి లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు.... ఇది వినగానే దీనిలో కొత్తేముందని మీరు అనుకోవచ్చు. ఉంది... మీరు ఊహించనంత కొత్తదనం ఉంది. ఈ మహాశయుడు... 1991 నుంచి ఒకే సెట్‌లోని లాటరీ టిక్కెట్ కొంటూవస్తున్నాడు. ఇప్పుడతను జాక్ పాట్ కొట్టాడు. 


ఈ వార్త వైరల్‌గా మారింది. కొంతమంది మొండిపట్టుదలతో కొన్ని పనులు చేస్తూ వస్తుంటారు. అమెరికాలోని మిచిగాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 1991 నుంచి అంటే గడచిన 30 ఏళ్లుగా ఒక సెట్‌లోని లాటరీ టిక్కెట్ కొంటూ వస్తున్నాడు. 61 ఏళ్ల ఈ వ్యక్తి తన పేరును మీడియా ముందు వెల్లడించలేదు. అయితే లాటరీ టిక్కెట్‌లో జాక్ పాట్ తగిలిన తరువాత తాను లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసే వైనాన్ని మీడియాకు తెలియజేశాడు. ఆ అదృష్టవంతుడు లాటరీ జాక్‌పాట్‌లో 18.41 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. ఈ మొత్తంలో 11.7 మిలియన్ డాలర్లు క్యాష్ రూపంలో తీసుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. ఈ మొత్తాన్ని తన కుటుంబ సభ్యులకు ఇవ్వడంతోపాటు, దాన ధర్మాలకు కేటాయించనున్నట్లు తెలిపాడు. 

Updated Date - 2021-08-28T18:03:13+05:30 IST