America: ఆంథోనీ ఫౌచీ‌కి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్.. మూడేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-08-06T01:44:10+05:30 IST

అమెరికా ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు, యూఎస్ హెల్త్ ఎక్స్‌పర్ట్(US health expert) ఆంథోనీ ఫౌచీతో(Anthony Fauci)పాటు అతడి కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్ప

America: ఆంథోనీ ఫౌచీ‌కి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్.. మూడేళ్ల జైలు శిక్ష

ఎన్నారై డెస్క్: అమెరికా ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు, యూఎస్ హెల్త్ ఎక్స్‌పర్ట్(US health expert) ఆంథోనీ ఫౌచీతో(Anthony Fauci)పాటు అతడి కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం రోజు తీర్పు వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం థామస్ కొన్నాలి జూనియర్(Thomas Connally Jr) అనే వ్యక్తి, ఆంథోనీ ఫౌచీ సహా ఇతర వైద్య నిపుణులకు బెదిరింపు మెయిల్స్ పంపాడు. వైద్య నిపుణులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను రోడ్డుపైకి కొట్టి చంపిన తర్వాత నిప్పంటిస్తానంటూ మెయిల్స్ చేశాడు. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకుని.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు(Court).. థామస్ కొన్నాలికి మూడేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 


Updated Date - 2022-08-06T01:44:10+05:30 IST