కరోనా ఎఫెక్ట్: సౌదీలో ఉమ్మేసిన వ్యక్తికి మరణ శిక్ష?

ABN , First Publish Date - 2020-04-04T22:07:52+05:30 IST

కరోనా కలకలం నేపథ్యంలో వ్యాధి వ్యాప్తికి దారి తీసే చర్యలకు పాల్పడిన ఓ సౌదీ వ్యక్తికి మరణ శిక్ష పడే అవకాశం ఉందని సౌదీకి చెందిన ఆన్‌లైన్ వార్తా వెబ్ సైట్ ఎజెల్ ప్రచురించింది.

కరోనా ఎఫెక్ట్: సౌదీలో ఉమ్మేసిన వ్యక్తికి మరణ శిక్ష?

రియాద్: కరోనా కలకలం నేపథ్యంలో వ్యాధి వ్యాప్తికి దారి తీసే చర్యలకు పాల్పడిన ఓ సౌదీ వ్యక్తికి మరణ శిక్ష పడే అవకాశం ఉందని సౌదీకి చెందిన ఆన్‌లైన్ వార్తా వెబ్‌సైట్ ఎజెల్ ప్రచురించింది. సదరు వ్యక్తి ఇటీవల.. సూపర్ మార్కెట్లలోని షాపింగ్ ట్రాలీలపై ఉమ్మి వేస్తూ అధికారులకు దొరికిపోయాడు. హెయిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నేరం రుజువైతే అతడికి మరణ శిక్ష విధించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వ్యాఖ్యానించినట్టు సదరు వెబ్‌సైట్ వెల్లడించింది. అతడి చర్య చట్టపరంగానే కాకుండా మతపరంగానూ గర్హనీయమైనదని ప్రాసిక్యుషన్ భావిస్తున్నట్టు సమచారం. ‘ఉద్దేశపూర్వకంగా సమాజంలో వైరస్ వ్యాపింప జేయడం, కల్లోలానికి కారణం కావడమనేది నేరం’ అని ఓ అధికారి వ్యాఖ్యానించినట్టు సదరు వెబ్‌సైట్ ప్రచురించింది. 

Updated Date - 2020-04-04T22:07:52+05:30 IST