వీడియో: తల లోపలకు దిగిన కత్తి.. చూస్తే షాకవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2020-06-25T00:51:00+05:30 IST

సినిమాల్లో ఒకరిపై ఒకరు కత్తి దూసుకోవడం సహజంగా చూస్తూనే ఉంటాం.

వీడియో: తల లోపలకు దిగిన కత్తి.. చూస్తే షాకవ్వాల్సిందే!

న్యూయార్క్: సినిమాల్లో ఒకరిపై ఒకరు కత్తి దూసుకోవడం సహజంగా చూస్తూనే ఉంటాం. బయట ఎక్కడా చూడని విధంగా సినిమాల్లో ఫైట్ సన్నివేశాలు ఉంటాయి. అయితే అమెరికాలో తాజాగా జరిగిన ఓ సంఘటన నిజంగా సినిమాను తలపిస్తోంది. న్యూయార్క్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైనున్న వీడియోను చూస్తే.. ఓ వ్యక్తి తల లోపలకు కత్తి దిగి ఉండటం కనిపిస్తుంది. అయినప్పటికి ఆ వ్యక్తి రోడ్డుపై ఏమీ జరగనట్టే తిరగడం కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఆ వ్యక్తి తలలోకి కత్తి ఎలా దిగిందంటే.. న్యూయార్క్ నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నలుగురు దుండగులు ఓ మహిళ పర్సు కాజేసి ఆమెపై దాడికి దిగారు. ఇదే సమయంలో వీడియోలో ఉన్న వ్యక్తి వారి నుంచి మహిళను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో దుండగులు బాధితుడిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. 


రక్తం వచ్చేలా కొట్టడమే కాకుండా అతడి తలపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో కత్తి అతడి తలలో ఉండిపోయింది. స్థానికంగా ఉన్న వ్యక్తులు బాధితుడిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. పోలీసులకు, ఆసుపత్రికి కూడా సమాచారమివ్వడంతో వెంటనే అక్కడకు అంబులెన్స్ చేరుకుంది. ఇదిలా ఉండగా.. కత్తి మెదడుకు తాకకపోవడం వల్ల బాధితుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు చెప్పుకొచ్చారు. బాధితుడు, బాధిత మహిళ ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. అయితే మహిళకు, బాధితుడికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.  

Video Credits: 3w-News

Updated Date - 2020-06-25T00:51:00+05:30 IST