మాస్క్ వేసుకోమంటే.. పామును చుట్టుకున్నాడు!

ABN , First Publish Date - 2020-09-16T19:13:48+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో నోరు, ముక్కును కప్పి ఉంచుకోండి. మాస్కు మాత్రమే ధరించాలన్న నియమం ఏమీ లేదు. స్కార్ఫ్ గానీ లేదా తమకు తగిన మరేదానితోనైనా ఉపయోగించండి.. ఇదీ వాయువ్య ఇంగ్లండ్‌లోని ప్రభుత్వ రవాణా అధికారులు జారీ చేసిన సూచన. ఇది చదివిన మీకు ఏమి అర్థమైంది..? మాస్క్‌గానీ లేదా మరేదైనా వస్త్రంతో గానీ నోరు, ముక్కును కప్పిం ఉంచాలనే కదా.. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ సూచనకు తనదైన నిర్వచనం చెప్పుకున్నాడు.

మాస్క్ వేసుకోమంటే.. పామును చుట్టుకున్నాడు!

లండన్: ‘‘బహిరంగ ప్రదేశాల్లో నోరు, ముక్కును కప్పి ఉంచుకోండి. మాస్కు మాత్రమే ధరించాలన్న నియమం ఏమీ లేదు. స్కార్ఫ్ గానీ లేదా మీకు తగిన మరేదేనినైనా ఉపయోగించండి..’’ ఇదీ వాయువ్య ఇంగ్లండ్‌లోని ప్రభుత్వ రవాణా అధికారులు జారీ చేసిన సూచన. ఇది చదివిన మీకు ఏమి అర్థమైంది..? మాస్క్‌గానీ లేదా మరేదైనా వస్త్రంతో గానీ నోరు, ముక్కును కప్పి ఉంచాలనే కదా.. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ సూచనకు తనదైన నిర్వచనం చెప్పుకున్నాడు. 


ప్రజా రవాణా బస్సులో బయలు దేరిన అతడు ఏకంగా బతికున్న పామునే మాస్కుగా వినియోగించాడు. మొదట్లో అతడిని చూసిన తోటి ప్రయాణికులు ఇదేదో వింత మాస్కు అని భ్రమపడ్డారు. కానీ.. పాము మెల్లగా కదలడం గమనించాక వారికి అసలు విషయం అర్థమైంది. ఆ తరువాత..సహజంగనే ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియా బాట పట్టాయి. 



‘మా నిబంధనలు స్పష్టంగానే ఉన్నాయి. స్కార్ఫ్, మాస్కు లేదా తమకు తగిన మరేదైనా వినియోగించాలని మేము పేర్కొన్నాం. ఈ సూచనను మరో రకంగా నిర్వచించే అవకాశం కొంత ఉన్నప్పటికీ మరీ ఇలా పాములను మాస్కులుగా కప్పుకోమనే అర్థం తీయకూడదు’ అని అక్కడి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తరువాత ట్రాన్స్‌పోర్టు అధికారులు.. ఈ తలనొప్పంతా ఎందుకనుకుని మరింత స్పష్టంగా ఉండేలా  మార్గదర్శకాలలో తగు మార్పులు చేశారు.

Updated Date - 2020-09-16T19:13:48+05:30 IST