నగలు డబ్బుతో America పారిపోయిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్

ABN , First Publish Date - 2021-09-01T03:47:17+05:30 IST

భార్య తనను మోసం చేసి పారిపోయిందనే బాధలో ఓ భర్త ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య పారిపోయిన విషయం తట్టుకోలేక..

నగలు డబ్బుతో America పారిపోయిన భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్

చండీఘర్: భార్య తనను మోసం చేసి పారిపోయిందనే బాధలో ఓ భర్త ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య పారిపోయిన విషయం తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంధువులు అతడిని కాపాడారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పారిపోయిన మహిళపై కేసు నమోదు చేయడమే కాకుండా, ఆత్మహత్యకు పాల్పడినందుకు భర్తపై కూడా కేసు నమోదు చేశారు.


ఎస్సై అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్యానాలోని స్థానిక నౌరత గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి భార్య కోమల్ ఇంటి నుంచి పారిపోయిందనే బాధలోనే యువకుడు ప్రాణాలు తీసుకోవాలనుకున్నట్లు తేలింది. ఆమె వెళ్లిపోతూ ఇంట్లో నుంచి భారీగా బంగారం, నగలను తీసుకుని వెళ్లిపోయింది. అయితే తన భార్య పారిపోవడానికి ఆమె తండ్రి, సోదరులే కారణమని, తనకు తెలియకుండా ఆమెకు వీసా ఇప్పించారని సదరు యువకుడు పోలీసులకు వెల్లడించాడు.


ఆమె వెళుతూ వెళుతూ భారీగా నగదు, బంగారం కూడా పట్టుకుపోయింది. దీంతో తాను నాశనమైపోయానంటూ అతడు వాపోయాడు. ఆమె తల్లిదండ్రులు, భార్య, ఆమె సోదరుడు, అత్త ఇమ్లా, కిర్స్‌నో ఫుఫా, అత్త కొడుకు రాంపాల్, అలాగే బావమరిది అందరూ కలిసే ఆమెను ఇక్కడి నుంచి పంపించివేశారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-01T03:47:17+05:30 IST