నాకు video calls చేయకుంటే అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తా...అమ్మాయిలను బెదిరించిన యువకుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-16T16:11:45+05:30 IST

ఓ యువకుడు మార్ఫింగ్ చేసిన అమ్మాయిల అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తానంటూ బెదిరించిన ఘటన న్యూఢిల్లీలో శనివారం వెలుగుచూసింది....

నాకు video calls చేయకుంటే అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తా...అమ్మాయిలను బెదిరించిన యువకుడి అరెస్ట్

న్యూఢిల్లీ: ఓ యువకుడు మార్ఫింగ్ చేసిన అమ్మాయిల అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తానంటూ బెదిరించిన ఘటన న్యూఢిల్లీలో శనివారం వెలుగుచూసింది. కపిల్ కుమార్ అనే నిందితుడు హర్యానాలోని పానిపట్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.22 ఏళ్ల వయసున్న కపిల్ కుమార్ అనే యువకుడు అమ్మాయిల పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించి, తనకు వీడియో కాల్స్ చేయకుంటే మార్ఫింగ్ చేసిన యువతుల అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తానని బెదిరించాడు.ఢిల్లీలోని బురారీ నివాసి అయిన 20 ఏళ్ల యువతి తనకు అశ్లీల ఫొటోలు,వీడియోలు వచ్చాయని ఆరోపిస్తూ ఢిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్ నార్త్ జిల్లాలో ఫిర్యాదు చేసింది. 


ఎవరో తన పేరు మీద రెండు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లు సృష్టించారని, తన మహిళా స్నేహితుల  పేరిట కూడా నకిలీ ప్రొఫైల్‌లను తయారు చేశారని బాధిత యువతి ఆరోపించింది. తనకు వీడియో కాల్స్ చేయకుంటే మార్ఫింగ్ చేసిన చిత్రాలను పోస్ట్ చేస్తానని నిందితుడు బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.దీంతో ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ల వివరాలను పోలీసులు పొందారు. దీని ఆధారంగా ప్రొఫైల్ నమోదులో ఉపయోగించిన ఐపీ చిరునామాలు, ఈమెయిల్ ఐడీలను సేకరించారు. ఐపీ చిరునామాల సాంకేతిక విశ్లేషణతో ఉపయోగించిన మొబైల్ నంబర్,ఐఎంఈఐ నంబర్‌ను బహిర్గతం అయింది.దీంతో నిందితుడు కపిల్ కుమార్‌ను పోలీసులు పానిపట్ నగరంలో అరెస్టు చేశారు.


నిందితుడి నుంచి రెండు సిమ్‌కార్డులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు కపిల్ మొదట స్థానిక సెలబ్రిటీ పేరుతో నకిలీ ప్రొఫైల్  సృష్టించి ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదుదారురాలికి స్నేహితుడిగా మారాడని తేలింది. కొన్ని రోజులపాటు యువతితో చాటింగ్ చేశాడు.యువతికి అనుమానం వచ్చి ఆయనతో చాటింగ్ చేయటం మానేసింది.దీంతో నిందితుడు ఫిర్యాదుదారురాలైన యువతి మాట్లాడాలని పట్టుబట్టాడు. నిందితుడు ఫిర్యాదుదారురాలి పేరిట నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను సృష్టించి ఆమెకు సందేశం పంపాడని వెల్లడైంది.  నిందితుడు ఓ యువతితోపాటు ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులను అనుసరించడం ప్రారంభించాడు.తన ఫాలోవర్లను పెంచుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో అమ్మాయిల ఫేక్ ప్రొఫైల్‌లను కూడా తయారు చేసేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


Updated Date - 2022-07-16T16:11:45+05:30 IST