Viral video: పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడి దాడి.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా కర్రతో కొట్టి..

ABN , First Publish Date - 2022-04-10T20:48:16+05:30 IST

సాధారణ పౌరుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే వార్తలు అప్పుడప్పుడు చూస్తుంటాం.

Viral video: పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడి దాడి.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా కర్రతో కొట్టి..

సాధారణ పౌరుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే వార్తలు అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్‌పైనే దాడికి తెగబడ్డాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద కర్రతో తరిమి తరిమి కొట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం ఆ దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దినేష్‌ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్‌ బైక్‌తో కానిస్టేబుల్‌ జై ప్రకాశ్‌ బైక్‌ని ఢీ కొట్టాడు. దాంతో ప్రకాశ్ `జాగ్రత్తగా బైక్ నడుపు` అని దినేష్‌ను హెచ్చరించాడు. అంతే దినేష్ తీవ్రంగా ఆగ్రహం చెంది ఆ కానిస్టేబుల్‌ లాఠీని లాక్కుని మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అయినా కానిస్టేబుల్‌ తిరగబడకుండా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే దినేష్‌ మాత్రం కానిస్టేబుల్‌ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 



Updated Date - 2022-04-10T20:48:16+05:30 IST