తండ్రి మరణానికి ప్రతీకారం కోసం 15 ఏళ్లు ఎదురుచూసిన యువకుడు.. పగతీర్చుకోవడానికి ఎంత పనిచేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-22T05:43:30+05:30 IST

15 ఏళ్ల క్రితం అతని తండ్రి బంధువుల ఇంట్లో మరణించాడు. తండ్రి చావుకి ఆ బంధువులే కారణమని ఆ యువకుడు పగబట్టాడు. తన మనసులో రగులుతున్న ప్రతీకార జ్వాలలను శాంతింపజేయడానికి ఒకరోజు అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి బంధువల ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న తన బావను కడతేర్చాడు...

తండ్రి మరణానికి ప్రతీకారం కోసం 15 ఏళ్లు ఎదురుచూసిన యువకుడు.. పగతీర్చుకోవడానికి ఎంత పనిచేశాడంటే..

15 ఏళ్ల క్రితం అతని తండ్రి బంధువుల ఇంట్లో మరణించాడు. తండ్రి చావుకి ఆ బంధువులే కారణమని ఆ యువకుడు పగబట్టాడు. తన మనసులో రగులుతున్న ప్రతీకార జ్వాలలను శాంతింపజేయడానికి ఒకరోజు అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి బంధువల ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న తన బావను కడతేర్చాడు. హత్య చేయకముందు తన తల్లికి ఫోన్ చేసి తండ్రి మరణానికి పగ తీర్చుకోబోతున్నానని చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజీపూర్ నగరంలో ఆకాశ్(31) అనే యువకుడు నివసిస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం ఆకాశ్ తండ్రి అతడి పెద్దమ్మ(ఆకాశ్ తల్లికి అక్క) ఇంట్లో ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆకాశ్ తండ్రి ఇంటి పైభాగం నుంచి కిందపడి చనిపోయాడని అందరూ భావించారు. కానీ ఆకాశ్ పెద్దమ్మ కొడుకు సునీల్ పైనుంచి తోయడంతోనే తన తండ్రి చనిపోయాడంటూ ఆకాశ్ అనుమానించేవాడు. ఈ అనుమానంతోనే సునీల్‌పై ఆకాశ్ పగపెంచుకున్నాడు. 


ఇటీవల ఒక రోజు ఆకాశ్ తన స్నేహితుడు సుధీర్‌తో కలిసి రాత్రివేళ మద్యం సేవించాడు. ఆ సమయంలో ఆకాశ్ తన మనసులో బాధను, పగను విశాల్‌తో పంచుకున్నాడు. ఇక సునీల్‌ను ప్రాణాలతో వదలనని అప్పటికప్పుడు ఒక తుపాకీ తీసుకొని విశాల్‌తో బయలుదేరాడు. అలా అర్ధరాత్రి 1.30 గంటలకు సునీల్ ఇంటికి ఆకాశ్, విశాల్‌ చేరుకున్నారు. ఇంటి తలుపులు గట్టిగా తట్టగా.. సునీల్ తమ్ముడు సుధీర్ ఏమైందని వచ్చాడు.


అప్పుడు ఆకాశ్ తాగిన మత్తులో తన తల్లికి ఫోన్ చేసి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నట్లు చెప్పాడు. ఆ తరువాత తన జేబులో నుంచి తుపాకీ తీసి నిద్రపోతున్న సునీల్ తలపై కాల్చాడు. అడ్డు వచ్చిన సుధీర్‌ను తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు.  


సునీల్ హత్యకేసులో పోలీసులు ఆకాశ్‌ని అరెస్టు చేయగా.. అతని స్నేహితుడు విశాల్ పరారీలో ఉన్నాడు. మృతుడు సునీల్(40)కి ఒక కూతురు(17), కొడుకు(16) ఉన్నారని పోలీసులు తెలిపారు.



Updated Date - 2022-02-22T05:43:30+05:30 IST